డర్టీ హీరోయిన్ వడ్డించేసిందిగా !

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడు మారి చేస్తున్న చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి-సిమ్రత్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు. బోల్డ్ అండ్ డర్టీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇటీవలే హీరో శ్రవణ్ రెడ్డి ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సిమ్రత్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ అనడం కంటే బోల్డ్ లుక్ అనాలేమో. ఆ రేంజులో అందాలని ఆరబోసింది సిమ్రత్.

నిర్మాతగా ఎంఎస్ రాజుకి క్లీన్ ఇమేజ్ ఉంది. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాస్ సినిమాలు తీశాడు. అలాంటి ఎంఎస్ రాజు దర్శకుడుగా మారాడు అంటే.. ఆయన నుంచి ఓ ఆణిముత్యం లాంటి సినిమా వస్తుందని అనుకొన్నారంతా. కానీ, ఆయన నేటి యువ దర్శకుల ఫార్ములాని ఎంచుకున్నారు. ‘డర్టీ హరి’ టైటిల్ అనే బోల్డ్ టైటిల్ పెట్టారు. అంతేకంటే బోల్డ్ గా సినిమాని తీశారని ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఊహించుకోవచ్చు