రివ్యూ : దర్భార్ – రజనీ వన్ మేన్ షో

చిత్రం : దర్భార్ (2020)

నటీనటులు : రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి తదితరులు

సంగీతం : అనిరుధ్

దర్శకత్వం : ఏఆర్ మురగదాస్

నిర్మాత : సుభాస్కరన్

రిలీజ్ డేటు : జనవరి9, 2020

సౌత్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే.. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాఫ్ వేర్ కంపెనీలకి సెలవు ప్రకటించి.. సినిమా చూసేందుకు టికెట్ కూడా ఇచ్చేంత క్రేజ్ రజనీ సొంతం. రజనీ సినిమా పోస్టర్స్ భూమిని వదిలి ఆకాషానికి తాకేంతగా. ఆటోలు, బస్సులు, రైళ్లు మాత్రమే కాదు.. విమానాల్లోనూ రజనీ పోస్టర్స్ దర్శనమిస్తాయ్. అలాంటి రజనీ సినిమా కోసం తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ప్రేక్షకుడు మాత్రమే కాదు.. ప్రపంచ సినిమా ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు. రజనీ మార్క్ ఎంటర్ టైనర్ ని చూసి ఎంజాయ్ చేయాలని ఆశపడుతుంటాడు.

మరీ.. వారి కోరికని దర్భార్ తీర్చిందా ? ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన చిత్రం దర్భార్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. దర్భార్ లో ఏముంది ? అది రజనీ ఫ్యాన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఆధిత్య అరుణాచలం(రజినీకాంత్‌) ముంబయిలో ఒక పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ముంబై సిండికేట్ క్రిమినల్స్ ని తాట తీసిన పోలీసోడు. ఇలాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ కి ట్రాన్స్ ఫర్స్ సాధారణమే. అరుణాచంలను ముంబయి నుండి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అక్కడ పెద్ద క్రైమ్‌ను వెలికి తీస్తాడు. దాని గుట్టు లాగితే చాలా పెద్దల తలకాయలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ కేసును ఛేదించే క్రమంలో అరుణాచలంకు ఎదురైన సమస్యలు ఏంటీ.. ? విలన్‌ గ్యాంగ్‌ ఆటలు కట్టించేందుకు అరుణాచలం బ్యాడ్‌ కాప్‌గా మారి ఏం చేశాడు అనేది దర్భార్ కథ.

ఎలా ఉందంటే ?

సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా అంటే.. ఎలాంటి కథని తీసుకున్నా దానికి రజనీ మార్క్ అద్దాల్సిందే. దర్శకుడు మురగదాస్ కూడా అదే చేశాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథకి రజనీ మార్క్ మాస్ స్క్రీన్ ప్రజెన్స్ ని జత చేశాడు. దాంతో రజనీ ఎంట్రీ.. ఆయన మార్క్ పోలీసిజం అదిరిపోయింది. రజనీ ప్రేక్షకులు ఏం కోరుకుంటారో.. అన్నీ అంశాలని పేర్చుకుంటూ వెళ్లాడు.

ఆ అంశాలతో ఫస్ట్ ఆఫ్ సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ఏపీసోడ్ లో మురగదాస్ తనదైన మార్క్ చూపించాడు. దాంతో సెకాంఢాఫ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఐతే, సెకాంఢాఫ్ జోరు తగ్గింది. కథ ఎమోషనల్ డీల్ చేశాడు. కూతురు సెంటిమెంట్ బాగానే పండినా.. తొలి భాగంతో పోలిస్తే తగ్గినట్టు అనిపిస్తుంది. దీనికితోడు మురగదాస్ మార్క్ స్క్రీన్ ప్లే ఇందులో కనిపించలేదు.

ఎవరెలా చేశారంటే ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటనకి వంకపెట్టలేం. దర్భార్ లోనూ రజనీ వన్ మేన్ షో చేశారు. ఆయన మాస్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకే హైలైట్. రజనీ యంగ్ లుక్ లో కనిపిస్తారు. ఎంతలా అంటే.. రజనీ తిరిగి 30వయసులోకి వచ్చారా ? అన్నంతగా. ఆయన పక్కన నయనతార అద్భుతంగా నటించింది. రజనీ-నయన్ కాంబో వచ్చే సీన్స్ ఆకట్టుకొన్నాయి. సినిమాలో కూరుతు సెంటిమెంట్ బాగా పడింది. రజనీ కూతురుగా నివేదా థామస్ నటన బాగుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి ఆకట్టుకున్నాడు. మిగితా నటీనటులు తమ తమ పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా : కథ-కథనాలని గ్రిప్పింగా నడపడం మురగదాస్ ప్రత్యేకత. దాంతోపాటు సోషల్ మెసేజ్ ఇస్తుంటారు. దర్భార్ ఆ కొలతలతోనే తెరకెక్కింది. కాకపోతే.. ఇందులో మురగ మార్క్ స్కీన్ ప్లే కనిపించలేదు. అనిరుధ్ మంచినేపథ్య సంగీతం అందించారు. ఐతే, తెలుగు వర్షన్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

* రజనీ, నయనతార

* మాస్ ఎలిమెంట్స్

* కూతురు సెంటిమెంట్

మైనస్ పాయింట్స్ :

* కథనం

* తమిళ్ ఫ్లేవర్

చివరగా : దర్భార్’లో రజనీ వన్ మేన్ షో. రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. మిగితా వారు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ, అది బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో మాత్రం కాదు.

రేటింగ్ : 3/5