ఏపీ మూడు రాజధానులపై కేంద్రం ఎందుకు సలైంట్ గా ఉందంటే ?
రాజధాని అంశంతో ఏపీ రగిలిపోతుంది. రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి తెదేపా, జనసేన నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో రైతులు, నేతల అరెస్టులతో అమరావతి ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఐతే, ఈ వ్యవహారంపై కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే ? రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటున్నారు. ఒకవేళ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సలహా అడిగితే.. స్పందిస్తామని భాజాపా నేతలు చెబుతున్నారు. కానీ అసలు వాస్తవం వేరే ఉంది.
మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం అనుకూలం. కేంద్రం ముందస్తు అనుమతితోనే జగన్ ప్రభుత్వం ఏపీలో మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్తుందని చెబుతున్నారు. లేదంటే.. ? ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. సీఎం జగన్ సర్కార్ ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్రపతి పాలన విధించాలంటూ బీజేపీ నేతలు హంగామా చేసేవారు. మూడు రాజధానులకి కేంద్రం సపోర్టు చేస్తుంది కాబట్టే.. అది రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.