సీఎం జగన్ కేసు ఈ నెల 17కి వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు కోర్టుకి వచ్చారు.
ఈ సందర్భంగా ఈడీ కేసులో తనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోర్టుని కోరారు. తనకి బదులుగా తన సహ నిందితుడు హాజరవుతారని చెప్పారు. దీనిపై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కోర్టుకి హాజరవ్వడం ఇదే తొలిసారి. ఈ ఉదయం 10:40కి కోర్టుకి వచ్చిన సీఎం జగన్.. విచారణ ముగిసిన వెంటనే బేగంపేట విమానాశ్రాయనికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి ఏపీకి వెళ్లనున్నారు.