‘దర్బార్’పై కొత్త వివాదం
ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘దర్భార్’. నయనతార కథానాయిక. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. తొలిరోజే రూ. 100కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ వివాదం కూడా తెరపైకి వచ్చింది.
దర్భార్ లో ఓ జైలు సన్నివేశంలో ఉంది. ముంబై పోలీసు కమిషనర్ హోదాలో రజనీ వెళుతుంటే.. ఓ ఖైదీ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు డబ్బులుంటే ఖైదీలు షాపింగ్ కు కూడా వెళ్లవచ్చన్న రజనీ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఇది అన్నాడీఎంకే నేత శశికళని ఉద్దేశించే పెట్టారని.. ఆ డైలాగ్ ని తొలగించాలని శశికళ తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. వాస్తవానికి సినిమాలో వచ్చే సీన్ లో ఎక్కడా శశికళ పేరుని ప్రస్తావించలేదు. అయినా. గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే.. ? భుజాలు తడుముకున్నట్టు.. శశికళ మనుషులు వ్యవహరిస్తున్నారు.