పీయూష్ గోయల్’ని కలిసిన కేటీఆర్
ఢిలీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని కలిశారు. ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నైను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరిగనున్న ‘బయో ఆసియా సదస్సు’కు పీయూష్ గోయల్ ని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ అయిన ‘హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్స్’ వివరాలను పీయూష్ గోయల్ అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కోరిన అంశాలపై ఓ నివేదిక రెడీ చేయాలని గోయల్ తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోరికలని గోయల్ తీర్చేలా కనిపిస్తోంది.