అనసూయకు మెగా ఝులక్

హాట్ యాంకర్ అనసూయకు ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు పెరిగాయ్. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత క్షణం, రంగస్థలం సినిమాలతో విజయాలు అందుకుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత అనసూయ నటిగా అవకాశాలు పెరిగాయ్.

ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కిందనే ప్రచారం జరిగింది. ఐతే, లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? చిరు సినిమాలో అనసూయ నటించడం లేదట. కావాలనే అనసూయను చిరు నుంచి తప్పించా.. ? లేదంటే అనసూయనే తప్పుకుందా ?? అనేది తెలియాల్సి ఉంది. కారణాలేమైనా.. అనసూయకి మెగా ఝులక్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవలే చిరు-కొరటాల సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో చిరు దేవదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. ఆయనకి జంటగా త్రిష నటించనుంది. మణిశర్మను సంగీతం అందించనున్నారు. సినిమాలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఏపీసోడ్ కూడా ఉండనుందట. ఫ్లాష్ బ్యాక్ లో నక్సలిజం ఏపీసోడ్ వస్తుందని చెప్పుకొంటున్నారు. ఆగస్టు 14న చిరు152 ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారమ్.