హైపర్ కమిటీ రెండో సమావేశం.. ఏం చర్చించారంటే.. ?
ఏపీ రాజధానిపై జీఎన్ రావు, బీసీజీ (బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్) ఇచ్చిన నివేదికలని అధ్యయనం చేసేందుకు జగన్ సర్కార్ హైపర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కమిటీ రెండోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో జీఎన్ రావు, బీసీజీ.. ఈ రెండు నివేదికలే కాకుండా అన్నింటికి క్షుణంగా చర్చించినట్టు మంత్రి షేర్న్ నాని తెలిపారు.
రాజధాని రైతులకి ఎలా న్యాయం చేయాలని చర్చించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చర్చించినట్టు తెలిసింది. మరోవైపు, రాజధాని రైతుల ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చేసిన లాఠీచార్జ్ లు పలువురు మహిళలు గాయపడ్డారు.