మీడియాపై మహేష్ చిందులు
సూపర్ స్టార్ మహేష్ మీడియాకు షాక్ ఇచ్చాడు. మహేష్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. సరదా మాట్లాడుతాడు. వివాదాల జోలికి వెళ్లకుండా.. తన పరిధిలో ఓపిగ్గా సమాధానాలు ఇస్తుంటాడు. మీడియా ముందే మహేష్ ఫైర్ అయిన దాఖలాల్లేవ్. కానీ, మొదటి సారి మహెష్ మీడియాపై కన్నెర్ర చేశాడు. అడ్దంగా మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులపైనే సటైర్స్ వేశాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి11) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ టీవీ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో కొత్త మహేష్ కనబడ్డాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ సీరియస్ గా సమాదానాలు చెప్పారు. స్పెషల్ గా ఓ స్టిల్ అడిగినా ఇవ్వలేదు. కూర్చున్నప్పుడే తీసుకోమని మొహం మీదే చెప్పేశాడు. కాస్త నవ్వండి సార్ అంటే.. ఇంతే నవ్వుతా. అంతకన్నా నవ్వలేను అన్నారు.
మీరు నటిస్తున్న సినిమాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు కదా.. భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి కొనసాగిస్తారా ? అని ఓ మీడియా ప్రతినిధి అడిగితే.. ‘ఏ నిర్మాతగా కొనసాగితే నీకేమైనా ఇబ్బందా ?’ ఎదురు ప్రశ్న వేశారు. ఇలా ప్రశ్నలకి వంకరగా.. ? కోపంగా మహేష్ సమాధానం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బహుశా.. మీడియాపై మహేష్ కి పీకలదాక కోపం ఉన్నట్టుంది. దానికి కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.