ట్రంప్ అధికారాలు కట్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకి కళ్లెం పడింది. ఇరాన్ పై యుద్ధం ప్రకటించకుండా ట్రంప్ అధికారాలని కట్ చేశారు. ఈ మేరకు చేసిన తీర్మాణానికి ప్రతినిథుల సభలో ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా  224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్లు కూడా ఉన్నారు.

సులైమానీ హత్యకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది షియాలు ఇప్పుడు అమెరికా ధోరణిపై రగిలిపోతున్నారు. ఇరాన్ లోని అమెరికా దళాలాపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పై ప్రతికారం తీర్చుకొనే దిశగా.. ఆ దేశంపై యుద్ధం ప్రకటించే విధంగా ట్రంప్ నిర్ణయం తీసుకునే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అధికారాలని కట్ చేస్తూ.. ప్రతినిధుల తీర్మాణం తీసుకొచ్చింది. ఇప్పుడు ఇరాన్ ట్రంప్ ఏమీ చేయలేరు.