ఇదీ.. పొలిటికల్ ఇచిత్రం !

అధికారమే పరామావధి అన్నదానికి ఫర్ ఫెక్ట్ ఉదహరణ ఇది. పొద్దునే కాంగ్రెస్ లో చేరిన తెరాస నేత పొద్దుకేసరికి మళ్లీ గులాభి కండువా కప్పుకొన్నాడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పొలిటికల్ ఇచిత్రమిది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని ఫీర్జాదిగూడ ఉప సర్పంచ్‌ దయాకర్‌రెడ్డి కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఆశించి భగపడ్డారు. దాంతో ఆయన శుక్రవారం ఉదయం ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ విషయం తెలుసుకొని మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్ది రంగంలోకి దిగారు. దయాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అరగంటకు పైగా సాగిన చర్చల అనంతరం దర్గదయాకర్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి బోయినపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి వరకు ఫీర్జాదిగూడ పార్టీ ఇన్‌చార్జి, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాస్‌రెడ్డితో పా టు పార్టీ ముఖ్య నేతలతో కలిసి బుజ్జగించారు. దీంతో మొత్తబడ్డ దయాకర్‌రెడ్డి మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. దయాకర్ రెడ్డి పొద్దున కాంగ్రెస్ లో సాయంత్రం తిరిగి తెరాసలో చేరిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాయకులు కావాల్సింది పదవి మాత్రమే. పార్టీల జెండా-అజెండా కాదని రుజువు చేసిన సంఘటన ఇది.