ఢిల్లీ వెళ్లిన పవన్.. జగన్’కి చెక్ పెట్టేందుకేనా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజే జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అన్నీ జిల్లాలకి చెందిన జనసేన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెదేపాతో పొత్తుపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా పొత్తు పెట్టుకోవాలని కొందరు జనసేన నేతలు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన వేరు వేరుగా పోటీ చేయడం వైకాపాకి లాభించిందని అభిప్రాయపడ్దారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకి ప్రాధాన్యత ఇస్తామని పవన్ చెప్పారు. దాదాపు 50శాతం యువకులనే పోటీకి దింపుతామని హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో మధ్యలోనే మాట్లాడిన పవన్.. హుటాహుఠిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. భాజాపాకి ఎప్పుడూ దూరం కాలేదని పవన్ గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. జనసేనని భాజాపాలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. విలీనం సంగతి పక్కనపెడితే.. పవన్ ని బీజేపీ వైపు తిప్పుకొని.. ఆయన క్రేజ్ తో ఏపీలో అధికారంలోకి రావాలనే ఆలోచన మాత్రం భాజాపాకి ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. సీఎం జగన్ కి పవన్ చెక్ పెట్టబోతున్నట్టే.. !