అల్లు అర్జున్ కి గిఫ్ట్ గా రౌడీ దుస్తులు
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి రౌడీ దుస్తులు గిఫ్ట్ గా అందాయి. హీరో విజయ్ దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్ తో దుస్తుల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రౌడీ దుస్తులని అల్లు అర్జున్ కి గిఫ్ట్ గా పంపించారు విజయ్. వాటిని ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన బన్నీ.. విజయ్ కి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు.. ‘అల.. వైకుంఠపురంలో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో వాటిని ధరిస్తానని చెప్పారు. దీంతో రౌడీ బ్రాండ్ ని బన్నీ ప్రమోట్ చేయబోతున్నాడని తెలిసిపోయింది.
బన్నీ ట్విట్ కి ట్విట్ కి రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ‘అల.. వైకుంఠపురంలో’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవకొండ స్టయిల్ తనకిష్టమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బన్నీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలంటే తనకి గౌరవమని.. నాని, విజయ్ లాంటివారిని ఉద్దేశించి అన్నారు.
😁 Stylish Star x ROWDY
Wishing you a Rowdy good time and Blockbuster Success Bunny Anna.. Can't wait to see how this custom made pullover looks on you and look forward to #AlaVaikunthapurramuloo tomorrow🤘🏼 https://t.co/4EyeeW5RC8
— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2020