ట్విట్టర్ రివ్యూ : అల.. వైకుంఠపురంలో

త్రివిక్రమ్ సినిమా అంటేనే పండగలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్  కెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీరి కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్, బినెఫిట్ షోస్ పడిపోయాయ్. ట్విట్టర్ వేదిక అభిమానులు సినిమా టాక్ ని పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

సినిమా టాక్ కంటే ముందు.. అల.. థియేటర్స్ వద్ద సీన్స్ గురించి చెప్పాలంటే.. ఫ్యామిలీస్ తో థియేటర్స్ నిండిపోయాయ్. ఏ సినిమాకి రాని విధంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అల.. సినిమా కోసం, అదీకూడా బెనిఫిట్ షోస్ కే క్యూ కట్టడం విశేషం. దీంతో.. అల.. థియేటర్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లా కళకళలాడుతున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే అల.. అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

తొలి భాగంలో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ యావరేజ్ అనిపించినా ఎక్కడా బోర్ కొట్టదు. ఇక సెకాంఢాఫ్ అదిరిపోయింది. కాదు తోపు అంటున్నారు. ఆఫీస్ ఏపీసోడ్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ బాగున్నాయని చెబుతున్నారు. అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్. పూజా హెగ్డే స్టన్నింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది. అల.. పాటలు ఆల్రెడీ సూపర్ హిట్. సరికొత్త రికార్డులని సృష్టించిన సంగతి తెలిసిందే. థమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉందని చెబుతున్నారు.

మురళీ శర్మ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సముద్రఖని, టబు పాత్రలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా.. అల.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హాయిగా ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. ఓ రెండున్నర గంటల పాటు.. త్రివిక్రమ్ క్రియేట్ చేసిన వైకుంఠపురంలో విహరించవచ్చు. థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా.. ఆ ప్రభావం మనపై ఉంటుందనుకోండీ.. ! అదే త్రివిక్రమ్ సినిమాల ప్రత్యేకత. మొత్తానికి.. అల.. ట్విట్టర్ టాక్. సూపర్ హిట్టు.. ! కంగ్రాట్స్ అల.. టీమ్.