‘భీష్మ’ టీజర్ టాక్

వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ఎంటర్ టైనర్ గా కట్ చేశారు.

కథని ఏమాత్రం లీక్ చేయకుండా ఎంటర్ ట్రైనింగ్ బిట్ సీన్స్ తో టీజర్ ని కట్ చేశారు. వీటిలో నితిన్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ లా బీష్మ టీజర్ అనిపించింది. ఏం చేస్తుంటావ్ అంటే.. ? ఐఏఎస్, డీసీపీ, మీమ్స్ చేస్తుంటా అని నితిన్ చెప్పడం ఆకట్టుకుంది. ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దెబ్బకాయంత ఉంది’ అనే డైలాగ్ బాగా పేలింది. మొత్తంగా భీష్మ ఎంటర్ టైనింగ్ గా కనిపిస్తున్నాడు.