అల.. సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్ !

సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రివిక్రమ్-అల్లు అర్జున్’ల హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. అల.. అద్భుతంగా ఉంది. అసలు సిసలు సంక్రాంతి సినిమా. సంక్రాంతి విజేత అల్లు అర్జున్ నే అని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అల.. చిత్రబృందం సెలబ్రేషన్స్ మొదలెట్టింది. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొంది.

అల్లు అర్జున్ కేక్ కట్ చేసి దర్శకుడు మాటల మాంత్రికుడి తినిపించడం. వీరిద్దరు.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అల.. సెలబ్రేషన్స్ వీడియోలో చూడొచ్చు. హిట్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ కి డీప్ హగ్ ఒకటి ఇచ్చారు. ఇక సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బన్నీ చక్కగా ఒదిగీపోయి నటించారని చెబుతున్నారు. పండగకి ఫ్యామిలీ కలిసి అల.. సినిమాని చూసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.