సరిలేరు ఫస్ట్ డే కలెక్షన్స్

సంక్రాంతి పుంజుగా బరిలోకి దిగారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా శనివారం విడుదలైన సరిలేరుని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. ఆ రేంజ్ లోనే ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి.

తొలిరోజు సరిలేరు రూ. 46.77కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది. ఈ సినిమాకు రూ. 100కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం రెండు, మూడు రోజుల్లోనే తిరిగొచ్చాలే కనిపిస్తోంది. ఆపై వచ్చేవన్నీ లాభాలే. ఈ లెక్కన సరిలేరు నిర్మాతలకి భారీ లాభాలు ఖాయమని తేలిపోయింది.

ఆదివారం స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈనేపథ్యంలో.. సరిలేరు, అల.. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గట్టిపోటీ ఉండనుంది. ఇక ఈ నెల 15న కల్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా రానుంది. దీంతో త్రిముఖ పోటీ ఉండనుంది.