బీజేపీలో జనసేన విలీనం. కానీ.. !
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ విజయవంతం అయింది. ఆయన భాజాపాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలని భావించారో.. అది జరిగింది. ఇటీవల పవన్ మాట్లాడుతూ తాను బీజేపీకి ఎప్పుడూ దూరం కాలేదన్నారు. అప్పటి నుంచి బీజేపీలో జనసేన విలీనం కానుందనే ప్రచారం జరిగింది. ఆ మేరకు భాజాపా నేతల నుంచి ఒత్తిడిలు కూడా వచ్చాయ్. పవన్ కూడా ఒకే చెప్పారు. కానీ, అది ఇప్పుదే కాదు. బహుశా.. ఏపీలో భాజాపా అధికారంలోకి వచ్చాక కావొచ్చేమో.
అవునూ.. భాజాపా, జనసేన రెండు పార్టీలైనా ఒకే అజెండాపై పని చేయాలని నిర్ణయించారు. సోమవారం ఢిల్లీలో భాజాపా కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే భాజాపా-జనసేల బంధంపై సూచన ప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంక్రాంతి తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.
సూటిగా చెప్పాలంటే.. ? ఏపీ బీజేపీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతిలో పెడుతున్నారు. పవన్ ఏదీ అడిగినా కేంద్రం ఇస్తోంది. వాటిని వినియోగించుకొని పవన్ టాస్క్ పూర్తి చేయాలనే. ఆ టాస్క్ ఏంటీ అంటే.. ? ఏపీలో భాజాపాని అధికారంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత జనసేనని భాజాపాలో విలీనం చేసి.. భాజాపా అభ్యర్థిగా పవన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలి. ఇదే భాజాపా-జనసేన మధ్య ఇప్పటి వరకు జరిగిన ఒప్పందం. ప్లాన్ ఫిక్స్. ఇక దాన్ని ఆచరణలో పెట్టడమే తరువాయి.