సంక్రాంతి సంబరాల్లో కారు జోరు


అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కారు జోరు చూపిస్తోంది. ఎన్నికల్లో మాత్రమే కాదు.. సంక్రాంతి సంబరాల్లోనూ కారు హవా చూపిస్తోంది. సంక్రాంతి ముగ్గుల్లో ప్రతి ఇంటిముందు కారు నిలబడింది. 

దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తెరాస మీద ఉన్న ప్రేమను సంక్రాంతి ముగ్గుల రూపంలో చూపిస్తున్నారు. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అని తెలిసిపోతుంది. అదే జరిగితే.. 2020లో తెరాస బోణి కొట్టినట్టే.