లేడీ సూపర్ స్టార్ కిక్ పవర్ ఏమాత్రం తగ్గలేదుగా !

విజయశాంతి ఎంత పవర్ ఫుల్ అనేది తెలిసిందే. ఓ వైపు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలరో సినిమాలు చేస్తూనే.. మరోవైపు కర్తవ్యం, స్ట్రీట్ ఫైటర్, నాయుడమ్మ వంటి పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అప్పట్లోనే ఓ లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెళ్లారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి.. దాదాపు 13యేళ్లు సినిమాలకి దూరమయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా సరిలేరు శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. సీరియస్ పాత్రలో విజయశాంతి ఒదిగిపోయారు. వచ్చింది గ్యాప్ మాత్రమే. ఆ పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇకపై కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నారు.

తాజాగా లేడీ సూపర్ స్టార్ చేసిన ఓ స్టంట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఆమె అనేక యాక్షన్ సీన్లలో రౌడీల దుమ్ము దులుపుతూ కనిపించి, ఆకట్టుకున్నారు. దాదాపు గత 12 ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉన్న ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇన్నేళ్లవుతున్నా ఆమె కిక్ లోని పవర్ ఏ మాత్రం తగ్గలేదు. 53 ఏళ్ల వయసులోనూ ఆమె కాలిని లిఫ్ట్ చేసి, ఫైట్ చేస్తున్న వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.