రివ్యూ : ఎంతమంచివాడవురా
చిత్రం : ఎంతమంచివాడవురా (2019)
నటీనటులు : కల్యాణ్ రామ్, మెహ్రీన్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : గోపీసుందర్
దర్శకత్వం : సతీష్ విగ్నేశ
నిర్మాత : ఆదిత్య మ్యూజిక్ ప్రయివేటు లిమిటెడ్
రిలీజ్ డేటు : జనవరి 15, 2019
రేటింగ్ : 2.5/5
మాస్ హీరోలు ఫ్యామిలీ ఫ్యామిలీని మెప్పించాలని ఆరాటపడటం సహజం. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్.. లాంటి స్టార్స్ మొదట్లో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నా.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ ప్రేక్షకులని మెప్పించారు. ఇన్నాళ్లుగా మాస్ ఇమేజ్ తో రాణిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఫ్యామిలీ కావాలనుకొన్నాడు. తొలిసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశారు. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహ్రీన్ కథానాయిక. సంక్రాంతి సీజన్ లో ఆఖరి సినిమాగా ‘ఎంతమంచివాడవురా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. మంచివాడు ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
బాలు (కల్యాణ్ రామ్) చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకుంటాడు. చుట్టాలందరూ బాలుని ఒంటరిగా వదిలేస్తారు. అయినా.. బంధువులు, బాంధవ్యంపైనా బాలుకి అమితమైన ప్రేమ. అవతలి వారికి అవసరమైన బంధుత్వం అందిస్తూ.. తనకు కావాల్సిన ఎమోషన్స్‌ను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికి తమ్ముడు (సూర్య)గా, మనవడు (ఆదిత్య)గా, అన్న (రిషి)గా, కొడుకుగా మారిపోతాడు. కథలో నందిని (మెహ్రీన్) ఎవరు ? ఆమెపై ఉన్న ప్రేమని ఎందుకు బయటపెట్టలేకపోయాడు. ఇసుక మాఫియా రాజు గంగరాజు (రాజీవ్ కనకాల)తో బాలుకి శత్రుత్వం ఎందుకు వచ్చింది ? తెలియాలంటే.. ఎంతమంచివాడవురా సినిమా చూడాల్సిందే.
మాస్ హీరో, క్లాస్ దర్శకుడు కలిసి పండగ సినిమా చేస్తే.. ఆ సినిమాపై ఆసక్తి పెరగడం సహజమే. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ విగ్నేశ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహ్రీన్ కథానాయిక. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. మాస్ ఇమేజ్ ఉన్న హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు. మంచివాడు ఎలా ఉన్నాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
బాలు (కల్యాణ్ రామ్) చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకుంటాడు. చుట్టాలందరూ బాలుని ఒంటరిగా వదిలేస్తారు. అయినా బంధువులు, బాంధవ్యంపైనా బాలుకి అమితమైన ప్రేమ. అవతలి వారికి అవసరమైన బంధుత్వం అందిస్తు.. తనకు కావాల్సిన ఎమోషన్స్‌ను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికి తమ్ముడు (సూర్య)గా, మనవడు (ఆదిత్య)గా, అన్న (రిషి)గా, కొడుకుగా మారిపోతాడు. కథలో నందిని (మెహ్రీన్) ఎవరు ? ఆమెపై ఉన్న ప్రేమని ఎందుకు బయటపెట్టలేకపోయాడు. ఇసుక మాఫియా రాజు గంగరాజు (రాజీవ్ కనకాల)తో బాలుకి శత్రుత్వం ఎందుకు వచ్చింది ? తెలియాలంటే.. ఎంతమంచివాడవురా సినిమా చూడాల్సిందే.
బంధాలు.. అనుబంధాల చుట్టూ సాగే కథ ఇది. అయిన వాళ్లకి దూరమైన మనుషులకి ఆ లోటు తెలియకుండా, ఆ బంధాల్ని భావోద్వేగాల్ని అందించడమే ఇందులో కథానాయకుడి పని. ఇలాంటి కథలో ప్రతి సన్నివేశం హృదయాల్ని స్పృశించాలి. ఆ విషయంలో ఈ సినిమా కొద్ది మేరకే ప్రభావం చూపిస్తుంది. పండాల్సిన చోట భావోద్వేగాలు పండలేదు. ప్రేక్షకుడిని కథలో లీనం చేయడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో.. మంచివాడి పెద్ద పేరు రాకపోవచ్చు. యావరేజ్ గా మిగిలిపోవచ్చు.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ? ఈ సినిమా కల్యాణ్ రామ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. కల్యాణ్ రామ్ ఎక్కువగా మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేశారు. ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కొత్త జోనర్ అని చెప్పాలి. తొలిసారి ఫ్యామిలీ ప్రేక్షకులని మెప్పించారు కల్యాణ్ రామ్. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక యాక్షన్ సీన్స్‌లో కల్యాణ్ టైమింగ్ తెలిసిందే. ఇరగదీశాడు. ఇకపై కల్యాణ్ రామ్ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయొచ్చని ఈ సినిమా రుజువు చేసింది. మెహరీన్ అందంగా కనిపించింది. అభినయంతో ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి, విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని, రాజీవ్ కనకాల తమ తమ పరిథి మేరకు నటించారు.
సాంకేతికంగా :
మంచివాడి పాటలు బాగున్నాయ్. గోపీ సుందర్ మంచి పాటలు, అంతకంటే మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను అద్భతంగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఆదిత్య మూజిక్ తొలిసారి నిర్మాణ రంగంలోకి దిగి చేసిన సినిమా ఇది. సినిమాని రిచ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు.
ప్లస్ పాయింట్స్ : * కల్యాణ్ రామ్
* సినిమాటోగ్రఫీ
* సంగీతం
* ఎమోషన్
మైనస్ పాయింట్స్
* పడుతూ లేస్తూ సాగిన కథనం
* స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా సాగలేదు
చివరగా : మంచివాడు బాగున్నాడు. కానీ, సక్రాంతి సీజన్ లో సరిలేరు, అల.. సినిమాలకి పోటీనిచ్చే రేంజ్ మంచితనం లేదు.
రేటింగ్ : 2.5/5