నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్30 

ఇస్రో మరో విజయాన్ని సాధించింది. భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ -5 వాహకనౌక ద్వారా జీశాట్ 30 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. భారత్ కు చెందిన శక్తిమంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. 

ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు 3357 కిలోలు. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్ శాట్- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.