నిర్భయ ధోషులకి ఉరి వాయిదా
నిర్భయ ధోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ నెల 22న ఉదయం 7గంటలకి నిర్భయ కేసులో నలుగురు నిందితులని ఉరితీయాల్సి ఉంది. ఐతే, వీరిలో ఒకరైన ముకేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తు ఇంకా పెండింగులో ఉందని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అందువల్ల శిక్ష అమలును వాయిదా వేయాలని కోరింది.
కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలిన వారికీ శిక్షను అమలు చేయరాదని కారాగార నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేసింది. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. మరీ.. నిర్భయ ధోషుల ఉరికి ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుంది ? వారిని ఎప్పుడు ఉరితీస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.