వైరల్ : భార్యతో కలిసి పాటేసుకున్న బన్నీ
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్స్ కలిసి పాటేసుకోవడం సహజమే. ఐతే, ఆయన తొలిసారి భార్య స్నేహారెడ్డితో కలిసి పాటేసుకొన్నాడు. అలాగని వీరిద్దరు జంటగా ఓ సినిమా రాబోతుందేమో అనుకొనేరూ. ఇది ఫ్యామిలీ సినిమా. అల్లు-కొణిదెల సంక్రాంతి ఫ్యామిలీ సినిమా. సంక్రాంతి రోజున అల్లు-కొణిదెల కుటుంబాలు ఒకేచోటుకి చేరాయి. సరదాగా గడిపాయి.
ఈ సందర్భంగా స్పెషల్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఓ గాయకుడు అల..వైకుంఠపురములో చిత్రంలోని ‘సామజ వరగమనా…’ పాటను ఆలపిస్తుంటే, అల్లు అర్జున్ అతనితో గొంతు కలిపాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న బన్నీ భార్య స్నేహారెడ్డి, భర్తను పట్టుకుని తెగ సిగ్గుపడిపోయింది. ఈ జంట స్పెషల్ వీడియోను అల్లు శిరీష్ రికార్డు చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సీజన్ లో నాకు నచ్చిన పాట, నాకు ఇష్టమైన ఇద్దరు అని శిరీష్ కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.