రాజా కోసం ఇస్మార్ట్ పోరి రంగంలోకి దిగింది


ఇస్మార్ట్ పోరి నభా నటాషా రంగంలోకి దిగింది. డిస్కోరాజా కోసం ప్రమోషన్స్ మొదలెట్టింది. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటేష్ హీరోయిన్. బాబీసింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి నభా నటాషా ప్రమోషన్స్ మొదలెట్టింది. మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. మాస్ మహారాజా రవితేజ అదరగొట్టేశాడు. డిస్కోరాజా బాగుంటాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తొలిసారి డిస్కోరాజా ప్రమోషన్స్ లో పాల్గొన్న నభా.. హాట్ హాట్ గా ఫోటోలకి పోజులిచ్చింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.