రెండో వన్డే : ఆసీస్ 150/2 (25 ఓవర్లు)
రాజ్ కోట్ వేదికగా భారత్-ఆసీస్ జట్ల మధ్య జరుగుతున రెండో వన్డే రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ధావన్ 96, కేఎల్ రాహుల్ 80, విరాట్ కోహ్లీ 78, రోహిత్ శర్మ 42 పరుగులతో రాణించారు.
ఇక 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిలకడగానే ఆడుతోంది. 25ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 150 పరుగలు చేసింది. షమీ బౌలింగ్ లో మనీష్ పాండే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ తో డేవిడ్ వార్నర్ (15) వెనుదిరిగాడు. ఆసీస్ మరో ఓపెనర్ ఫించ్ 16వ ఓవర్ రెండో బంతికి ఫించ్ స్టంపౌట్ అయ్యాడు. జడేజా బంతిని చదవడంలో విఫలమైన ఫించ్ క్రీజ్ బయటకు వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బీటెన్ అయ్యాడు. ప్రస్తుతం స్మిత్ (61), లాబ్స్ చేంజ్ (33) ఉన్నారు.