అందుకే వీహెచ్ కి పీసీసీ పదవి

త్వరలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండబోతుంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలిచ్చింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ పోస్ట్ పై తన కోరికని మరోసారి బయటపెట్టాడు సీనియర్ నేత వి. హనుమంతరావు. తాను రాజీవ్ గాంధీ సిపాయినని.. తానూ పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించుకున్నారు.

అంతేకాదు.. తనకు వయోపరిమితి సాకుగా చూపుతూ పీసీసీ అధ్యక్ష పదవి నిరాకరించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీలోని అగ్రవర్ణాల నేతలు కూడా బీసీ వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నేతలకు ఢిల్లీలో అపాయింట్ మెంట్ ఇవ్వడం కాదని, జిల్లాల్లో పార్టీ శ్రేణుల మనోగతం తెలుసుకోవాలని హైకమాండ్ కు హితవు పలికారు.

గతంలో బీసీ నేత పొన్నాల లక్ష్మయ్యకి పీసీసీ పదవి దక్కినప్పుడు అందరికంటే ఎక్కువగా కుళ్లుకున్నది వీహెచ్ నే. పొన్నాల పదవి పోయే దాక ఆయనపై పడి ఏడిచాడు వీహెచ్. పొన్నాల పనికిరాడని.. రెడ్డినేతల కంటే ఎక్కువగా మొత్తుకున్నాడు. ఇప్పుడేమో.. బీసీ కార్డు వాడుతూ… తనకి తాను పీసీసీ రేసులో ఉన్నట్టు ప్రకటించుకుంటున్నాడు వీహెచ్.