17మంది తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతియే ముద్దు అంటూ.. తెదేపా నేతలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. మొత్తం 17మంది తెదేపా ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినవారిని మార్షల్స్ ని పిలిచి బయటపడేయండని.. స్వయంగా సీఎం జగన్ అనడం విశేషం.
తెదేపా నుంచి సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, బలరామకృష్ణంరాజు, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చిన్నరాజప్ప, వెంకట్రెడ్డినాయుడు, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయస్వామిలు ఉన్నారు.