పూరి-విజయ్.. ప్యాన్ ఇండియా సినిమా ప్రారంభం !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా రాబోటున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. అంతేకాదు.. ప్రారంభం రోజునే ఇది ప్యాన్ ఇండియా సినిమా అని చిత్రబృందం క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ట్విట్ చేశారు. పూరితో కలిసి విజయ్ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమా కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తారని, తల్లి సెంటిమెంట్ తో సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెల్ గా ఫైటర్ ఉండబోతున్నట్టు సమాచారమ్. అంటేకాదు.. ఈ సినిమాలో విజయ్ కి జంటగా బాలీవుడ్ యంగ్ హీరో జాన్వీ కపూర్ జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియనున్నాయి.