డిస్కోరాజా సెన్సార్ రివ్యూ 

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాషా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. బాబీ సింహా కీలక ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఈ వారమే (జనవరి 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

ఈ నేపథ్యంలో సెన్సార్ టాక్ బయటికొచ్చింది. సినిమాల చూసిన సెన్సార్ సభ్యులు డిస్కోరాజా బాగున్నాడని కితాబిచ్చారని తెలిసింది. ‘కిక్’ సినిమా తర్వాత ఆ రేంజ్ లో రవితేజ ఎంటర్ టైనర్ చేసిన సినిమా ఇదని చెబుతున్నారు. కథ-కథనాలు అద్భుతంగా కుదిరాయి. రవితేజ నట విశ్వరూపం చూపించారని చెబుతున్నారు. ఆయన అభిమానులకి విందు భోజనం లాంటి సినిమా. బాబీ సింహా నటన హైలైట్. డిఫరెంట్ టైమ్ జోన్స్ లో కథ ఆసక్తికరంగా సాగుతుందని సెన్సార్ టాక్. 

ఇక డిస్కోరాజాపై పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా.. ఒక్కటే పెద్ద మైనస్ గా కనబడుతోంది. అదే రాంగ్ టైమింగ్. ఇప్పటికే సంక్రాంతి పండగ పూట ప్రజలు ఖర్చుల్లో పడి ఉన్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయి మళ్లీ పనుల్లో బిజీ అయిపోయారు. ఇదీగాక.. సంక్రాంతి సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో సినిమాల  హవా ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిస్కోరాజా టికెట్స్ ఏ మేరకు తెగుతాయ్ అన్నది ఆసక్తిగా మారింది.