ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు
ఆంధ్రప్రదేష్ శాసన మండలి రద్దు దిశగా సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్. ఏపీకి మూడు రాజధానుల బిల్లుని సోమవారం శాసన సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది శాసన మండలి ఆమోదం. ఈరోజే మూడు రాజధానుల బిల్లుని మండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే, మండలిలో వైసీపీ ప్రభుత్వానికి తగినంత బలం లేదు.
ఈ నేపథ్యంలోనే అవసరమైతే శాసన మండలి రద్దు దిశగా వైకాపా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలిలో మూడు రాజధానుల బిల్లుని ఆమోదం పొందేందుకు వైకాపా ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటిది.. కొంతమంది తెదేపా ఎమ్మెల్సీలు గైహాజరుతో మండలిలో బిల్లుని పాస్ చేయించుకోవడం. లేదంటే.. బిల్లుని సెలక్టివ్ కమిటీకి పంపించడం. ఇక మూడో ఆప్షన్ మండలిని రద్దు చేయడం. మండలిని రద్దు చేసేందుకే.. వైకాపా మొగ్గు చూపుతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. మూడు రాజధానుల బిల్లు విషయంలో వైకాపా దూకుడు చూపిస్తోంది.