‘ఆర్ఆర్ఆర్’ కోసం అజయ్ దేవగణ్ వచ్చేశారు

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ట్విట్ చేసింది. రాజమౌళి-అజయ్ దేవగణ్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

“అజయ్ దేవగణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. వెల్ కమ్ అజయ్ దేవగణ్” అంటూ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ నటించనున్నారు. ఇక, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్నారు. తారక్, చరణ్ లకి గురువు తరహా పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ 80శాతంపైగా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. మరోవైపు జులై 30న రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ కి వాయిదా పడనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు. ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్  చిత్రబృందం ధృవీకరించాల్సి ఉంది.