సరిలేరు – మహేష్ కెరీర్’లోనే బిగ్గెస్ బ్లాక్ బస్టర్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో చాలానే బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ‘రాజకుమారుడు’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ మొత్తం 26 సినిమాలని పూర్తి చేశాడు. ఇందులో హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలున్నాయి. ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఐతే, మహేష్ కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలిచింది.

ఈ విషయాన్ని సరిలేరు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ని విడుదల చేశారు. సరిలేరు కేవలం పది రోజుల్లోనే రూ. 101.97కోట్ల షేర్ ని రాబట్టింది. నైజాంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లోనూ దూకుడు చూపిస్తోంది. ఈ క్రమంలో మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు నిలిచింది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించారు. ఆయనకి జంటగా రష్మిక మందన నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. చాన్నాళ్ల తర్వాత మహేష్  నటించిన మాస్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక మహెష్ తదుపరి సినిమా వంశీపైడి పల్లి దర్శకత్వంలో ఉండనుంది.