ఏపీ కేబినేట్ అత్యవసర భేటీ
ఏపీ కేబినేట్ అత్యవసరంగా సమావేశం కాబోతున్నట్టు సమాచారమ్. మూడు రాజధానుల బిల్లుని సోమవారం ఏపీ శాసనసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అదే బిల్లు ఈరోజు శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఐతే, మండలిలో వైకాపాకు సరైన బలం లేని నేపథ్యంలో గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మండలిని రద్దుచేసే ఆలోచనలో ఏపీ సర్కారు ఉంది.
దీనిపై చర్చించేందుకే ఏపీ కేబినేట్ మరికాసేపట్లో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. రద్దు విషయంపై మండలి కార్యదర్శికి మరి కాసేపట్లో లేఖ అందనున్నట్లు తెలుస్తోంది. క్యాబినేట్ భేటీకి మంత్రులంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం జగన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు, మండలి రద్దు అంతా ఈజీ ప్రక్రియ కాదని అంటున్నారు. దానికి కనీసం మూడ్నెళ్ల సమయం పడుతుంది. పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యవుతుంది. మరీ.. సీఎం జగన్ ఏ ధైర్యంతో మండలి రద్దు వైపు మొగ్గు చూపుతున్నారన్నది తెలియాల్సి ఉంది.