‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ పాత్ర ఇదే !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సినిమాలో అజయ్ దేవగణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. తారక్, చరణ్ లకి గురువు తరహా పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా, అజయ్ దేవగణ్ పాత్ర ఏంటన్నది బయటికి లీకైంది.

‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తారట. ఆయన సూచనల మేరకే కొమరం భీమ్ (ఎన్టీఆర్), అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) తిరుగుబాటు ప్రయత్నం చేస్తారట. ఐతే, ఈ ముగ్గురి కలయికని సినిమాలో రాజమౌళి ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ ఇద్దరు స్వాత్రంత్య్ర సరయోధుల కథ. కొమరంభీమ్, అల్లూరిల కథ అని అనుకొన్నాం. కానీ, అజయ్ దేవగణ్ భగత్ సింగ్ గా కనిపించబోతున్నారనే న్యూస్ లీక్ కావడంతో.. ఆర్ఆర్ఆర్ ముగ్గురు స్వాత్రంత్య్ర సమరయోధుల కథని తేలిపోయింది. ఇక జులై 30న రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ కి వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు.