ముంబైలో విజయ్ దేవరకొండకు అవమానం ?

టాలీవుడ్ సంచలనం విజయ దేవరకొండకు ముంబైలో అవమానం జరిగిందా ? ఆయనంటే పడిచచ్చే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ షాకిచ్చిందా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అసలు విషయం ఏంటంటే.. ? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది. అంతేకాదు.. ఈ సినిమా అధిక భాగం షూటింగ్ ముంబైలోనే ప్లాన్ చేశారట. ఎందుకంటే.. ? ఇందులో విజయ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందట. ఆమె కోసం ఫైటర్ షూటింగ్ ముంబైలో ప్లాన్ చేసినట్టు తెలిసింది.

జాన్వీ మాత్రం విజయ్ దేవరకొండతో సింగిల్ టేక్ కూడా చేయకుండానే నో చెప్పేసిందట. దానికి బిజీ షెడ్యూల్ నే కారణమని చెబుతున్నారు. మరోవైపు, విజయ్ తో నటించడం ఇష్టంలేకే జాన్వీ సినిమా నుంచి తప్పుకుందని చెప్పుకొంటున్నారు. గతంలో పలుమార్లు విజయ్ పై ఉన్న ప్రేమని బయటపెట్టింది జాన్వీ. ఆయనంతే క్రష్, ఇష్టం.. కానీ ఆయన నుంచి స్పందన ఎలాంటి స్పందన లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాంటి విజయ్ తో ఛాన్స్ వస్తే.. వదులుకోవడం ఎందుకన్నది.. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.