ఢిల్లీలోనూ.. ఏపీ రాజధాని హీట్ !
రాజధాని అంశం ఏపీ రాజకీయాలని హీటెక్కిస్తున్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లుని శాసనమండలిలో ప్రతిపక్షం తెదేపా అడ్డుకోగలిగింది. బుధవారం మండలి చైర్మన్ ఎంఎ షరీప్ తన విక్షణ అధికారులని వినియోగించి మూడు రాజధానుల బిల్లుని సెలక్షన్ కమిటీకి పంపించారు.
మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేంద్ర పెద్దల దగ్గర ప్రధానంగా ఏపీ రాజధాని అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. బుధవారం పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అంశంపై చర్చించారు. ఇక మరికొద్దిసేపట్లో పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఇప్పటికే పవన్ జేపీ నడ్డా నివాసానికి చేరుకోనున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది.
ఈ సమావేశంలోనూ ఏపీ రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాజధాని అంశంపై భాజాపా-జనసేనలు ఉమ్మడి అజెండాని రెడీ చేయనున్నారు. మూడు రాజధానుల బిల్లుని మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణ అధికారాలని వినియోగించి సెలక్షన్ కమిటీకి పంపించన సంగతి తెలిసిందే. దీంతో.. రాజధాని అంశంపై కాస్త సమయం దొరికొంది. ఈ నేపథ్యంలో.. రాజధానిపై అనుసరించిన వ్యూహంపై జేపీ నడ్డాతో పవన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.