మూడు రాజధానులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది : పవన్

ఏపీలో మూడు రాజధానులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఢిల్లీ టూర్ లో ఉన్న పవన్ ఈ ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందన్నారు.
 
వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ నేతలు చెబుతున్నట్టు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని అనుపతితోనే మూడు రాజధానుల ఏర్పాటు జరగలేదు. ఈ విషయంపై బీజేపీ క్లారిటీ ఇచ్చిందన్నారు పవన్. అంతేకాదు.. రాజధాని రైతులకి అండగా ఉంటామని పవన్ అన్నారు. ఫిబ్రవరి 2న బీజేపీ-జనసేన కలిసి లాంగ్ మార్చ్ చేయనున్నట్టు పవన్ తెలిపారు. మొత్తానికి.. పవన్ ఢిల్లీ పర్యటనతో మూడు రాజధానులపై కేంద్రం స్టాండ్ ఏంటన్నదానిపై క్లారిటీ వచ్చినట్టయింది.