చీటింగ్ కేసులో.. అజారుద్దీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు !
హెచ్‌సీఏ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్‌పై ఔరంగబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఔరంగబాద్‌కు చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని షాదాబ్.. ఈ ఫిర్యాదును నమోదు చేశారు.ట్రావెల్ ఏజెంట్ మొహమ్మద్ షాదాబ్‌ను సుమారు 20 లక్షల వరకు మోసం చేసినట్లు ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో అజహర్ తో పాటుగా ముజీబ్ ఖాన్(ఔరంగబాద్), సుదేశ్ అవిక్కల్(కేరళ)పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై అజహర్ స్పందించారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వార్తలు అవాస్తమని అజర్ అన్నారు. తన లీగల్ టీమ్‌తో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాదు.. పరువు నష్టం కేసును కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
I strongly rubbish the false FIR filed against me in Aurangabad. I’m consulting my legal team, and would be taking actions as necessary pic.twitter.com/6XrembCP7T
— Mohammed Azharuddin (@azharflicks) January 22, 2020