భిన్నంగా నాగశౌర్య ఆటోగ్రాఫ్

మాస్ మహారాజా రవితేజ ఆటోగ్రాఫ్ ఇచ్చి చాన్నాళ్లయింది. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్’ సూపర్ హిట్ అయింది. ఓ వ్యక్తి జీవితంలో తారసపడిన అమ్మాయిలతో సాగిన కథనం యువతని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా టీవీల్లో ఎప్పుడు వచ్చినా.. ఆసక్తికరంగా చూస్తుంటారు. నా ఆటోగ్రాఫ్ టైప్ సినిమాలు టాలీవుడ్ లో చాలానే వచ్చాయి. నాగ చైతన్య ‘ప్రేమమ్’ సినిమా ఇలాంటిదే.  

వివిధ వయసుల్లో వేరే వేరే అమ్మాయిలతో ప్రేమాయణం కాన్సెప్ట్ తో ప్రేమమ్ తెరకెక్కింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ కూడా ఇలాంటి కథే.  నలుగురు హీరోయిన్లు,నాలుగు ప్రేమ కథలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. నా ఆటోగ్రాఫ్ టైపు కథే మరోటి రాబోతుంది.

కొంచెం భిన్నంగా ఓ వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో ఒకే అమ్మాయితో బంధం ఎలా బలపడిందీ, ఎలా ఫ్రేమగా మారిందీ, ఎలా పెళ్లికి దారితీసిందీ అనే లైన్ తో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు నాగశౌర్య హీరో. సినిమా అమెరికా బ్యాక్ డ్రాప్ కూడా కొంత వుంటుంది. ఈ సినిమాలో ఒకే హీరోయిన్ వుంటుంది. హీరో మాత్రం వివిధ వయసుల్లో కనిపిస్తాడట. నాగశౌర్య అశ్వద్థామ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అవసరాల సినిమాలో నటించనున్నారు.