ఈ యేడాది బన్నీదే.. !
ఈ యేడాది ఆరంభం అదిరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అంటే మాత్రం అల.. నే అంటున్నారు. అల.. సంక్రాంతి విజేతగా నిలిచింది. పదిరోజుల్లోనే రూ. 143కోట్ల షేర్, రూ. 220కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఓవర్సీస్ లోనూ మూడు మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. అక్కడ టాప్-5 చిత్రాల్లో చేరిపోయింది. మొత్తంగా నాన్ బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసింది.
గత యేడాది మార్చిలో వచ్చిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఈ యేడాది ఆ పని అల్లు అర్జున్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ యేడాది బన్నీదే అంటున్నారు అభిమానులు. ఎందుకంటే.. ? జులై రావాల్సిన ఆర్ఆర్ఆర్ కూడా వచ్చే యేడాదికి వాయిదా పడే అవకాశాలున్నాయి. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ కి వెళ్లనుందని చెబుతున్నారు. అప్పటి వరకు అల్లు అర్జున్ దే హవా. ‘నా పేరు సూర్య’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ.. అల.. తో అభిమానులకి డబుల్ కికి ఇచ్చాడు బన్నీ.