మ్యూజికల్ పోస్టర్ : 30రోజుల్లో ప్రేమించడం ఎలా ?

యాంకర్ గా బుల్లితెరను ఏలుతున్నాడు ప్రదీప్. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు. చిన్న చిన్న పాత్రల్లో మెరిశాడు. తొలిసారి ప్రదీప్ హీరో అవతారం ఎత్తుతున్నాడు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే కుర్రాడి దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ’30రోజుల్లో ప్రేమించడం ఎలా ?’.

ఈ సినిమా మ్యూజికల్ పోస్టర్ ని హీరో రానా దగ్గుపాటి విడుదల చేశారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న పదీప్ కి రానా ఆల్ ది బెస్ట్ చెప్పారు. దానికి వెంటనే ప్రదీప్ థ్యాంక్స్ చెప్పారు. ఇక మ్యూజికల్ పోస్టర్ లో ప్రదీప్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆయనకి జంటగా అమృత అయ్యర్ నటిస్తోంది. మరీ.. హీరోగా ప్రదీప్ తొలి ప్రయత్నంలోనే కోరుకుంటూ.. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.