రెండో టీ20 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన కివీస్ మొదట బ్యాటింగ్ ని ఎంచుకుంది. రెండో టీ20 కోసం ఇరు జట్లలో ఎలాంటి మార్పుల్లేవ్. తొలి టీ20 ఆడిన జట్టుతోనే ఇరు జట్లు రంగంలోకి దిగాయి. 2 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు గుప్తిల్ 16, మున్రో 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇక తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టీ20లోనూ గెలుపుపొంది ఆధిక్యాన్ని 2-0కి తీసుకెళ్లాలనే కసితో ఉంది కోహ్లీ. టీమిండియా టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ కనిపిస్తొంది. రోహిత్ శర్మ, కోహ్లీ, కె.ఎల్ రాహుల్ లలో ఒకరు రాణిస్తే.. పని మరింత ఈజీ అవుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో యువ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ తొలి టీ20లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.