విషాదం : హెలికాప్టర్‌ ప్రమాదంలో బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబ్‌ మృతి 

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబ్‌ బ్రయంట్‌ (41) మృతి చెందారు. ఆదివారం ఆయన పయణిస్తున్న వ్యక్తిగత హెలికాప్టర్‌ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కోబ్‌ బ్రయంట్‌, ఆయన కుమార్తె సహా 9 మంది మరణించారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ణయించారు.

 కోబ్‌ బ్రయంట్‌ మాజీ ఎన్‌బీఏ స్టార్‌ ప్లేయర్‌ కావడం విశేషం. గతంలో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్‌ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నాడు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. 2016లో ఎన్బీఏ నుంచి మూడవమారు ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.