హైదరాబాద్ లోనూ కరోనా ఫీవర్

వణికిస్తోంది. కరోనా వైరస్ చైనాని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ సోకీ ఇప్పటికే 106మంది మృతి చెందారు. ఈ వైరస్ 4,515 మందికి సోకిన‌ట్లు తెలుస్తోంది. కరోనా కేంద్ర బిందువైన హుబెన్ ప్రావిన్సులో వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా స్కూళ్ల‌కు స్ప్రింగ్ ఫెస్టివ‌ల్ సెల‌వులు ప్ర‌భుత్వం పొడ‌గించింది. కరోనా వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రినే నిర్మిస్తోంది.

థాయిలాండ్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, అమెరికా, వియ‌త్నాం, సింగ‌పూర్‌, మలేషియా, నేపాల్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది. చైనా నుంచి వస్తున్న వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నలుగురిని ఫీవర్ ఆసుపత్రిలో చేర్పించి.. షాపింల్స్ ని పూణే ల్యాబ్ కి పంపించింది. వీరికి కరోనా లక్షణాలు లేవని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా వైరస్ సోకిన వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కరనో వైరస్ సోకినవారు గొంతునొప్పి, దగ్గు, తమ్ములు వస్తాయని.. అది క్రమంగా నియోనియకు దారితీస్తుంది. శ్వాసపై తీవ్ర ప్రభావంతో వైరస్ సోకిన 28రోజుల్లో వ్యక్తి మృతి చెందుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ కరనో వైరస్ స్వైన్ ప్లూ లాంటిదనేనని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, చేతులని శుభ్రంగా కడుక్కోవడం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.