నాని రాక్షసుడి లుక్


నేచురల్ స్టార్ నాని రాక్షసుడుగా మారిన సంగతి తెలిసిందే. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాని, సుధీర్ బాబు కథానాయకులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వి’. ఇందులో నాని నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. సోమవారం రక్షకుడు సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

ఈరోజు రాక్షసుడు నాని లుక్ ని వదిలారు. గుబురు గడ్డెంతో తీక్షణంగా చూస్తున్న నాని లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు సమ్మర్ లో వి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘వి’ నుంచి నాని, సుధీర్ బాబుల లుక్స్ వచ్చేశాయ్. ఇక రావాల్సింది హీరోయిన్స్ లుక్స్ నే. నివేదా, అతిథి ఫస్ట్ లుక్స్ ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.