తారస్థాయికి చేరిన ‘మా’లో విబేధాలు
‘మా’ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. నరేష్ నిధులని దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలని ఉల్లంఘిస్తున్నారని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆలోపిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాసిన లేఖలో దాదాపు 20మందికిపైగా సంతకాలు చేసినట్టు సమాచారమ్.
ఇటీవల జరిగిన ‘మా’ కొత్త సంవత్సర క్యాలెండర్ విడుదల కార్యక్రమంలోనే మా విబేధాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు రాజశేఖర్ ఆవేశం ప్రదర్శించారు. దానిపై ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు ఆగ్రహం వక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ రాజశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు సూచించారు. ఇంతలోనే రాజశేఖర్ మా పదవికి రాజీనామా చేశారు.
తాజాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కలిసి మా అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ ఒంటరి పోకడపై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏకంగా క్రమశిక్షణ కమిటీకి లేఖలు రాయడంతో.. మా లొల్లి మరోసారి తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.