ట్రైలర్ రివ్యూ : మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎం.సి.ఎ)

ఈ నెల 21న నేరుచరల్ స్టార్ నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి”గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య ఉండే అప్యాయ‌త‌, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వేణు శ్రీరామ్ దర్శకుడు. నాని సరసన సాయి పల్లవి జతకట్టనుంది. ఇప్పటికే విడుదలైయిన సినిమా పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది.

వ‌దిన‌ భూమిక నానిల మ‌ధ్య స‌న్నీవేశాలు, సాయి ప‌ల్ల‌వితో ప్రేమ సీన్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ని క్యాచీగా కట్ గా చేశారు. “మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. అర్ధ‌రూపాయి పెట్రోల్ ధ‌ర పెరిగితే అర్ధ‌రాత్రికి ముందే కిలోమీట‌ర్ల లైన్స్ లో ఉండే వాళ్లం.. అటువంటిది మా ఫ్యామిలీ జోలికి వ‌స్తే.. ” అంటూ నాని చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత.

ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్, నిన్నుకోరి సినిమాలతో రెండు హిట్స్ కొట్టాడు నాని. ‘ఎంసిఎ’ కూడా హిట్టయ్యితే.. ఈ యేడాది హ్యాట్రిక్ కొట్టిన హీరోగా నాని రకార్డు సృష్టించే అవకాశం ఉంది.