సమ్మర్ సినిమాలు రిలీజ్ డేట్స్

సంక్రాంతి సీజన్ ముగిసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన దర్భార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో హిట్ అనిపించుకున్నాయ్. సరిలేరు, అల.. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. పదిరోజుల్లోనే రూ. 100కోట్ల షేర్, రూ. 200కోట్ల గ్రాస్ ని దాటేశాయి. సంక్రాంతికి ప్రేక్షకులని ఫుల్ ఎంటర్ టైన్ చేశాయి. ఒక్క కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ మాత్రం నిరాశపరిచింది.

ఇక సమ్మర్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ని ఖరారు చేసుకుంటున్నాయి. దాదాపు డజనుకుపైగా సినిమాలు సమ్మర్ సీజన్ లో సందడి చేయబోతున్నారు. సమ్మర్ సినిమాలు, వాటి రిలీజ్ డేట్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ !

* మార్చి 6 – మిస్ ఇండియా 

* మార్చి 25  – వి

* ఏప్రిల్ 2  – శ్రీకారం

 * ఏప్రిల్ 2 – ఉప్పెన

*  ఏప్రిల్ 9 – రెడ్

* ఏప్రిల్ 17 – శేఖర్ కమ్ముల-నాగ చైతన్య

* ఏప్రిల్ 24 –  సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ 

* మే 1 – నార‌ప్ప  

* మే 8 – క్రాక్

వీటితో పాటు పవన్ కల్యాణ్ పింక్, నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలు మే నెలలోనే రాబోతున్నాయి.