రెండో పెళ్లిపై మంచు మనోజ్ ప్రకటన
మంచు మనోజ్ నుంచి సినిమా రాక చాన్నాళ్లయింది. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేదు. సినిమాలు చేయకపోవడానికి కారణం వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోంది. ఇటీవలే మనోజ్ తన భార్య ప్రణీతరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎంఎం ఆర్ట్స్ పతాకంపై మంచు మనోజ్ సినిమాలు నిర్మించబోతున్నాడు.
తాజాగా ట్విటర్ లో మనోజ్ స్పందిస్తూ.. “అగ్నిగోళంలా మండేందుకు సిద్ధంగా ఉన్నా. కొద్ది వారాల్లోనే మీకు ఒక ఆసక్తికర విషయం చెప్పబోతున్నా. వేచి చూడండి” అని ట్వీట్ చేశారు. దాంతో మనోజ్ రెండో పెళ్లి చేసుకొంటాడనే ప్రచారం జరుగుతోంది. ఓ అభిమాని ఆగక అడిగేశాడు. ఏంటి.. ? ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారా.. ? అంటూ ప్రశ్నించారు.
దానికి మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. “వామ్మో.. ” అంటూ అని సమాధానం ఇచ్చారు. పెళ్లి అన్నా.. పెళ్లాం అన్నా ఎంత విరక్తి పుట్టిందో మంచు మనోజ్ కామెంట్ ని బట్టీ అర్థమవుతోంది. దాంతో ఆయన ఇప్పట్లో మరో పెళ్లి చేసుకొనేందుకు రెడీగా లేరని అర్థమవుతోంది. ఇక మంచు మనోజ్ నుంచి రాబోతున్న బర్నింగ్ న్యూస్ ఏంటంటే.. ? ఆయన తదుపరి సినిమా విశేషాలని క్లారిటీ వచ్చినట్టయింది.